వేదాంతానికి భాష్యం చెప్పే పాట...
నేను దీన్ని సరిగ్గా అర్ధం చేస్కున్నానో లేదో తెలీదు కానీ.. నాకు అర్ధమైనంతలోనే... చాలా బాగా నచ్చిన పాట ఇది.
వేదాల సారాన్ని ఒక్క మాటలో తేల్చేశారు. ఈ జగమే ఒక మాయ... అందులో మన బ్రతుకొక మాయ!!! (ఈ మాయ గ్రహించక ఎందుకీ తాపత్రయం...)
కష్ట సుఖాలు.. కావడిలో అటూ ఇటూ వుండే కుండలంట... వాటిని నిలిపే కావడి - కొయ్య, ఆ కుండలేమో - మట్టి. తెలుసుకోవాల్సిన సత్యం!!!
దేని మీదా ఆశ పెట్టుకోకుండా పరులకోసం జీవించడంలో ఆనందం వుంది.. బాధని ఆనందం అనుకుంటే ఇక అసలు కష్టమన్నదే వుండదు...
ఆహా... మనబోటి వారికి ఇంత లోతుగా ఆలోచించటం సాధ్యమయ్యే పనేనా...!!!
సాహిత్యమే కాకుండా, ఈ పాట వినడానికి కూడా చాలా హాయిగా వుంటుంది...
Song: జగమే మాయా...
Movie: దేవదాసు (1953)
Lyrics: సముద్రాల Sr
Singer: ఘంటశాల
Music Director: Subbaraman C R
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment